AP Cabinet: ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు కీలక అంశాలపై చర్చించారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 45 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.
Read Also: CM YS Jagan: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
మిచౌంగ్ తుఫాన్ నష్ట పరిహారం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు ఆమోదం లభించింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభం కానున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది.