Site icon NTV Telugu

AP Cabinet: 13 బిల్లులకు ఏపీ క్యాబినెట్ ఆమోదం.. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

Ap Cabinet

Ap Cabinet

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుంది. 13 బిల్లులకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది..ఈ బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంలో చట్టసరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాలా చట్టం రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదం తెలిపింది కేబినెట్..వైఎస్ ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ ఆర్ పేరు తొలగిస్తూ చట్ట సవరణ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా సవరణ బిల్లుకు ఆమోదం.. జీఎస్టీలో సంస్కరణలు అమలు -2025 బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం.. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ చట్టసవరణ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read:Philippines Protests 2025: ఫిలిప్పీన్స్‌లో నేపాల్ నిరసనల ప్రకంపనలు.. రాజకీయ సంక్షోభం తప్పదా?

ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంలో పలు సవరణలకు క్యాబినెట్ ఆమోదం.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Exit mobile version