Banana Price Drop in AP: అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. అయితే, ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్‌లో చర్చించండి అంటూ కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్‌లో అరటి పంటకు కిలో ధర కేవలం యాభై పైసలకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరగాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు.
Read Also: Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
హర్షకుమార్ తన లేఖలో ”అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారడం రైతుల్ని నిరాశలోకి నెట్టేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అరటికి భారీ డిమాండ్, భారీ ధరలు ఉన్నా… ఇక్కడ రైతులకు మాత్రం అవమానకరంగా యాభై పైసలు మాత్రమే ఇస్తున్నారు. అమెరికాలో డాలర్లు సంపాదిస్తుండగా, మా రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మరియు లోక్‌సభ ఎంపీ మాణికం ఠాగూర్‌కు హర్ష కుమార్ లేఖ రాశారు. అలాగే.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. పార్లమెంటులో ఆంధ్రా అరటి రైతుల సమస్యను తప్పనిసరిగా ప్రస్తావించాలని కోరారు.
మరోవైపు అరటి పంటను కనీస మద్దతు ధర (MSP) తో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు హర్ష కుమార్.. రైతుల నష్టాలను తగ్గించేందుకు ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలన్న ఆయన.. పంట నిల్వకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. .
