NTV Telugu Site icon

Speaker Tammineni Sitaram: అవసరం అనుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మళ్లీ పిలుస్తా.. స్పీకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Tammineni Seetharam

Tammineni Seetharam

Speaker Tammineni Sitaram: అవసరం అనుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మరోసారి పిలుస్తాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిలిపించాం.. లాంచనంగా కన్‌క్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది.. అందుకే రెండు పార్టీలలో అటు ఇటు వెల్లిన వారిని పిలిపించాం. మేం అడగాల్సింది అడిగాం, వారు చెప్పాల్సింది చెప్పారని తెలిపారు.. కానీ, బయటకు వెళ్లిన తర్వాత విమర్శలు ఏం చేస్తున్నారు..? ఆ విమర్శలకు ఏం తక్కువ లేదు అని మండిపడ్డారు.. ఆ విషయాలపై తిరిగి మేం మాట్లాడితే భరించలేరని వ్యాఖ్యానించారు.. లోపల మాట్లాడింది బయటకు చెప్పకూడదు. అది పెద్ద నేరం.. వారు చెప్పినవన్నీ చేసుకుపోతే అసలు అసెంబ్లీయే మిగలదు అని వ్యాఖ్యానించారు.

Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అజెండా ఇదే..!

ఎవరేం అనుకున్నా తమ్మినేని కరెక్ట్ గా చేశారు.. నా పరిది దాటలేదన్నారు స్పీకర్‌.. అవసరం అనుకుంటే మరోసారి పిలుస్తాం అని స్పష్టం చేశారు. ఇక, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై స్పందిస్తూ.. గంటాకు ఆరోజే చెప్పాను రిజైన్ చేసావు కదా తర్వాత నిర్ణయం తీసుకుంటామని.. దాని అనుగుణంగానే ఆ రాజీనామాకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. కాగా, వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరో ఛాన్స్ ఇచ్చిన విషయం విదితమే.. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేసిన విషయం విదితమే.