Site icon NTV Telugu

18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల18 వ తేదితో పాటు19 తేదిలలో రెండు రోజులు సభను నిర్వహించాలని భావిస్తు న్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత 20వ తేదితోపాటు21 శని, ఆది వారాలు రావడంతో ఆయా దినాలను సెలవుగా కేటాయించ నున్నారు. ఈనెల 22వ తేదినుంచి ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిచాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ తేదిలపై పూర్తి స్పష్టతను ఈ నెల 18న జరిగే బీఏసీ సమావేశంలో రానుంది. ఇప్పటికే ఆయా సమస్యలపై చర్చించాలని జగన్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు సమాచారం. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

Exit mobile version