Site icon NTV Telugu

Anushka Shetty Birthday: గ్లామర్‌ పాత్రలే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్! హ్యాపీ బర్త్ డే అనుష్క

Anushka Shetty Birthday

Anushka Shetty Birthday

Lady Super Star Anushka Shetty turns 42. ‘ఫేస్ ఆఫ్ ది’ సినిమాగా చెప్పుకునేది హీరోనే. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో ‘అనుష్క శెట్టి’ ముందువరుసలో ఉన్నారు. తన అందం, అభినయం, విజయాలతో హీరోల‌కు స‌మానంగా.. ఇమేజ్, మార్కెట్ ఏర్పరుచుకున్నారు. అనుష్క న‌టించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి.. ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఇటీవల అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో స్వీటీ తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఓవైపు స్టార్ హీరోల అందరితో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే.. మరోవైపు సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించడం ఈ దశాబ్దంలో అనుష్క శెట్టికే సాధ్యమైంది. మిగతా హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సిన్మాలు చేసినా.. అనుష్క లాగా సక్సెస్ కాలేకపోయారు. సూపర్, ల‌క్ష్యం, శౌర్యం, విక్రమార్కుడు, చింత‌కాయ‌ల ర‌వి, డాన్ లాంటి సినిమాల్లో గ్లామర్ ఒలబోసిన అనుష్క.. వేదం సినిమాలో సరోజ క్యారెక్టర్‌లో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డులను అందుకున్నారు.

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో అనుష్క టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే అందం,అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. బాహుబలి సినిమాలోని ‘దేవసేన’ పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన ‘నిశ్శబ్దం’ ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది.

Also Read: Anushka Shetty Birthday: బర్త్‌డే గిఫ్ట్‌గా.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ పార్ట్‌-2 ప్రకటన రానుందా?

అనుష్క శెట్టి అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క తన 50వ సినిమా భాగమతి-2ని యూవీ క్రియేషన్స్ భారీగా ప్లాన్ చేసింది. నేడు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఆడియెన్స్, ఇండస్ట్రీకి ఇష్టమైన స్వీట్ హీరోయిన్ ‘స్వీటీ’ శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో ముందుకు సాగాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే.. అనుష్క శెట్టి.

Exit mobile version