NTV Telugu Site icon

Anupama Parameswran : ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు ఎంతో బాధ పడ్డాను..

Whatsapp Image 2023 07 09 At 9.57.26 Pm

Whatsapp Image 2023 07 09 At 9.57.26 Pm

అనుపమ పరమేశ్వరన్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ .అలాగే నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించికుంది ఈ భామ. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. జీవితం గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు కూడా చేసింది.ప్రతీ మనిషి జీవితంలో ప్రేమ, ఎమోషన్స్ వంటివి ఉండాలి అవి లేకపోతే అది అస్సలు జీవితమే కాదు ఈరెండు ఉంటేనే జీవితం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీనికి సబంధించిన ఓ డైలాగ్ కూడా 18 పేజెస్ సినిమాలో ఉంది.ఆ డైలాగ్ తనకు ఎంతగానో నచ్చింది అని తెలిపింది అనుపమా.అలాగే మనిషిలో నిజాయితీ తనకు బాగా నచ్చుతుందని తెలిపింది.ఎవరైనా నిజాయితీగా మాట్లాడితే తను ఇంప్రెస్ అవుతుందట.. తాను ఏ విషయం అయినా కానీ సూటిగా చెప్పేస్తుందట.

జీవితం ఎంతో చిన్నది ఉన్న ఈ కాస్త సమయాన్ని సంతోషంగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి.. అంతే కాని వేస్ట్ విషయాలు మైండ్ లో స్టోర్ చేసుకుని.. జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని తెలిపింది అనుపమా.ఇక ప్రతీ మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినప్పుడు దాని గురించి జీవితాంతం బాధపడుతూ ఉంటాడు. అలా తన జీవితంలో కూడా ఒక విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాను అని తెలిపింది అనుపమా. ఆ విషయం ఏమిటీ అంటే రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో తానే హీరోయిన్ గా చేయాల్సి ఉందట..కానీ ఆ ఛాన్స్ మిస్‌ అయింది. అలా ఛాన్స్ మిస్ అయినప్పుడు తను ఎంతో బాధ పడినట్లు తెలిపింది.. ఒకవేళ ఆ సినిమాలో కనుక నటించి ఉంటే తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అయ్యేదేమో అని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంతో బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్.