Anupama Parameswaran : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో వరుస సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ఫుల్ ఫామ్ లో ఉంది.రీసెంట్ గా అనుపమ ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈగల్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన టిల్లుస్క్వేర్ మూవీతో అనుపమ సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించింది.సినిమాబండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వంలో ‘పరదా’ అనే సినిమాను అనుపమ ప్రకటించింది.
అలాగే కోలీవుడ్ లో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బైసన్’ అనే సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే అనుపమ ప్రధాన పాత్రలో ‘లాక్ డౌన్’ అనే సినిమాని కూడా ప్రకటించారు.తాజాగా అనుపమ తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ డైరెక్టర్ మురళి కిషోర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించనుంది.గతంలో అనుపమ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు సినిమాలో కలిసి నటించింది.మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది.