Anu Emmanuel Reveal Secret: చాలా కాలం తరువాత ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టాడు. అందులో తనతో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్తో శిరీష్ కెమెస్త్రీ బాగా వర్కవుట్ అయింది. దీంతో సినిమా యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ మూవీ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా రూపొందించింది చిత్రబృందం. డేటింగ్ లాంటి అంశాలతో రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తొలిసారి అనూ.. అల్లు శిరీష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. పలువురు హీరోలతో అనూ నటించినా.. ఈ మూవీ ఆమెకు మరింత మైలేజీ ఇచ్చిందని.. యూత్ బాగా ఆమెకు కనెక్టు అయ్యేలా ఆమె పాత్ర ఉందంటున్నారు.
Read Also: Iron leg Pooja: బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. వరుస ఫ్లాపులతో వెకేషన్ మూడ్లోకి పూజాహెగ్దే
చిన్న సినిమాగా మొదలై పెద్దగా అంచనాలు లేని ఉర్వశివో.. రాక్షసివో మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో దాదాపు పది సినిమాలు ఒకే శుక్రవారం విడుదలైనా.. పోటీలో ఉన్న ఏకైక సినిమాగా ఉర్వశివో.. రాక్షసివో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో నటించిన శిరీష్- అనుల రిలేషన్ డేటింగ్ వరకు వచ్చినట్లుగా గాసిప్ నడుస్తోంది. దీనిపై తాజాగా అనూ రియాక్టు అయ్యింది. అల్లు శిరీశ్ తో తాను డేటింగ్ లో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని.. నటీనటులపై ఇలాంటి వార్తలు రావటం సహజమని చెప్పారు. తాను ఇలాంటివి పట్టించుకోనని.. కానీ తన తల్లి మాత్రం ఈ వార్తల్ని చదవి చాలా బాధ పడినట్లుగా చెప్పింది.