NTV Telugu Site icon

Anthrax Alert: అలెర్ట్‌.. మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్‌ మహమ్మారి.. ముగ్గురికి నిర్ధారణ..

Antrax

Antrax

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ బారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం నాడు తెలిపారు. మంగళవారం నుండి గురువారం మధ్య లక్ష్మీపూర్ బ్లాక్‌ లో మూడు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఆంత్రాక్స్ అనేది స్పోర్ ఫార్మింగ్ బాక్టీరియం బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల కలిగే వ్యాధి. తాజాగా ఈ వ్యాధి ముగ్గురికి ఆంత్రాక్స్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వారిని చికిత్స కోసం లక్ష్మీపూర్ హాస్పిటల్‌ లో చేర్చారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం నుంచి ముగ్గురు గ్రామస్తులకు అది సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు వైద్యులు. కోరాపుట్ అదనపు జిల్లా వైద్య అధికారి సత్యసాయి ఈ విషయాన్ని తెలిపారు.

Rohit Sharma: వేచి ఉండలేనంటున్న టీమిండియా కెప్టెన్.. వీడియో..

పరిస్థితిని అంచనా వేయడానికి ఆంత్రాక్స్ కేసులు నమోదైన కుటింగ గ్రామానికి ఆరోగ్య నిపుణుల బృందాన్ని పంపినట్లు అధికారి తెలిపారు. కొత్త కేసులు ఏవీ నివేదించబడనందున పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని తెలిపారు. ఆంత్రాక్స్ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ చర్యల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేశామని అధికారి చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (IEC) కార్యక్రమాలు మొదలు పెట్టారు. రాబోయే కొద్ది రోజుల పరిస్థితిని అంచనా వేయడానికి గ్రామం, దాని పరిసర ప్రాంతాలలో తగినంత మంది ఆరోగ్య అధికారులను నియమించారని ఆయన చెప్పారు.

Gangs Of Godavari : విశ్వక్ సేన్ మూవీ చూసిన బాలయ్య..అదిరిపోయిందంటూ ప్రశంసలు..