Site icon NTV Telugu

Antarvedi Beach: 500 మీటర్లు లోపలికి వెళ్లిన అంతర్వేది బీచ్.. సునామీకి సంకేతమా?

Antarvedi Beach

Antarvedi Beach

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లి, ముందుకు రావడంతో కలకలం రేపుతుంది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు లోపలికి వెళ్లడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన అంతర్వేది సర్పంచ్ కొండా జాన్ బాబు ఇది సునామీకి సంకేతం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో అంతర్వేది బీచ్‌లో పేరుకుపోయిన ఒండ్రు మట్టి బయటపడడంతో పర్యాటకులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Asia Cup 2025 Trophy: ఆసియా కప్‌ ట్రోఫీతో పీసీబీ చీఫ్ పరార్.. సిగ్గులేదంటూ ఫాన్స్ ఫైర్!

ఈరోజు మధ్యాహ్నం సమయానికి అంతర్వేది బీచ్ వద్ద సముద్రం ముందుకు వచ్చింది. సముద్ర కెరటాలు లైట్ హౌస్ ను తాకుతున్నాయి. సముద్రపు ఆటు, పోట్లు కారణంగా ఇలా జరుగుతుందా? లేదా? మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. బంగాళాఖాతంలోకి గోదావరి వశిష్ట నది కలిసే ప్రదేశంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం అంతర్వేది. ఇది పుణ్యక్షేత్రంగా, పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది.

Exit mobile version