Site icon NTV Telugu

Anrich Nortje : క్యాచ్ ఇలా కూడా పడతారా..?

Stunning Catch

Stunning Catch

సౌతాఫ్రికా బౌలర్ అన్ రిచ్ నోర్జ్టే తెలివైన క్యాచ్ అందుకున్నాడు. బహుశా క్కికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ లు చాలా అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు క్యాచ్ లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్ పట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పితే బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్ లు తీసుకోవడం చూస్తుంటాం. కానీ నోర్ట్జే కాస్త కొత్తగా, వెరైటీగా ఆలోచించాడు. బ్యాటర్ బంతిని షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్ట్జే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్ ను ఒడిసిపట్టుకుంది. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్ గా నోర్జ్టే తీసుకున్న క్యాచ్ ను క్రికెట్ ఫ్యాన్స్ పిదా అయ్యారు. అందుకే నోర్జ్టే అందుకున్న క్యాచ్ లందూ ఈ క్యాచ్ వేరయా అన్న క్యాప్షన్ సరిగ్గా సరిపోతుంది. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం జరిగింది.

Also Read : Top Headlines @9AM: టాప్ న్యూస్

ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్సింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్సింగ్స్ లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు.

Also Read : IPL 2023 : CSK పతనానికి అదే కారణం?.. “డాడ్స్ ఆర్మీ”కి మాథ్యూ హేడెన్ వార్నింగ్

అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్ (18 బంతుల్లో 43 పరుగులు ) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్ తో పాటు చార్లెస్ ( 14 బంతుల్లో 28 ) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇవాళ జరుగనుంది.

https://twitter.com/starmanjeet007/status/1639655419022036998

Exit mobile version