ANR’s Premabhishekam: 45 ఏళ్లు పూర్తి చేసుకున్న‘ప్రేమాభిషేకం’.. స్పెషల్ వీడియో వైరల్!

Anr's Premabhishekam

Anr's Premabhishekam

తెలుగు చిత్రసీమలో ‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాల్లో ‘ప్రేమాభిషేకం’ ఒక మైలురాయి. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, అప్పట్లో ఇదొక సంచలనంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలై నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ ఏఎన్నార్‌కు ఘన నివాళులు అర్పించింది.

Also Read : Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం..

1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం, అప్పట్లో అనేక కేంద్రాలలో ఏడాదికి పైగా (365 రోజులు) ప్రదర్శితమై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో షిఫ్టులు లేకుండా ఏడాది పాటు ఆడటం అప్పట్లో ఒక సంచలనం. దర్శకుడు దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఏఎన్నార్ నటన అద్వితీయం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిగా, ప్రేమికుడిగా ఆయన పండించిన హాస్యం, చూపించిన వేదన ప్రేక్షకుల గుండెలను పిండేసింది. శ్రీదేవి, జయసుధల నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. ముఖ్యందా చక్రవర్తి స్వరపరిచిన పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్. “దేవీ.. శ్రీదేవీ..”, “నా కళ్లు చెబుతున్నాయి..”, “వందనం.. అభివందనం..” వంటి పాటలు తెలుగు వారి ఇళ్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఇక “లక్షల మంది హృదయాల్లో ఏఎన్నార్ ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావు” అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.