Vande Bharat Train Secunderabad- Visakha: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి వందే భారత్ రైళ్లలో మరొకటి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగో వందే భారత్ (Vande Bharat) రైలు పట్టాలనెక్కనుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం (Secunderabad- Visakha) మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్ శ్రేణిలో ఇది నాలుగవది. అయితే, ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ ( Vande Bharat ) రైలును ప్రవేశ పెట్టారు. రేపటి (మార్చి 13 ) నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు తొలి సర్వీస్ నడుస్తుంది అన్నమాట.
Read Also: Gold Price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే?
ఇక, మార్చి 15వ తేదీ శుక్రవారం నుంచి సికింద్రాబాద్ – విశాఖ (Secunderabad- Visakha) సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇవాళ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ట్రైన్ నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05కు బయల్దేరుతుంది. విశాఖపట్నం మధ్యాహ్నం 1. 50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ సర్వీస్ మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయల్దేరి.. రాత్రి 11.20గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Read Also: BJP : 8రాష్ట్రాల్లో 100సీట్లపై బీజేపీ అభ్యర్థుల పేర్లపై చర్చ.. రెండో జాబితా ఖరారు!
అయితే, వందే భారత్ రైలు సికింద్రాబాద్‌లో (Secunderabad) ఉదయం 5.05కు బయల్దేరి వరంగల్ 6.40, ఖమ్మం 7.45, విజయవాడ 9.10, రాజమండ్రి 11.02, సామర్లకోట 11.45, విశాఖపట్నం 1.50కు బయలుదేరుతుంది. ఒక్కో స్టేషన్‌లో నిమిషం మాత్రమే ఆగుతుంది. విజయవాడలో మాత్రమే ఐదు నిమిషాల హాల్ట్ ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఇందులో ఏడు ఏసీ ఛైర్ కోచ్‌లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఉంటాయి. ఈ రైలులో దాదాపు 530 మంది ప్రయాణం చేయొచ్చు. ఇక, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.