NTV Telugu Site icon

రాజ్‌కుంద్రా పొర్నోగ్రఫీ కేసులో మరో ట్విస్ట్‌ !

SEBI slaps Rs 3 Lakhs fine on Shilpa Shetty and Raj Kundra

ఆశ్లీల చిత్రాలు నిర్మిస్తూ అడ్డంగా దొరికిపోయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాంటి లీగల్‌ నోటీసులు ఇవ్వకుండానే.. ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తనను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తున్నాడు. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరువైపుల వాదనలు వింది. అసలు రాజ్‌కుంద్రాను ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందో ధర్మాసనానికి వివరించారు పోలీసుల తరపు లాయర్‌. పొర్నోగ్రఫీ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో.. రాజ్‌కుంద్రా ఇందుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారని.. కొన్ని పోర్న్‌ వీడియోలు డిలీట్‌ చేశారని.. అందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నామని వాదించారు.

read also : ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

ఆధారాలు మాయం చేస్తుంటే మూగ ప్రేక్షకునిగా కూర్చొని ఉండలేమన్న పోలీసుల తరపు న్యాయవాది.. కుంద్రా వ్యక్తిగత ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్ల నుంచి 51 ఆశ్లీల చిత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరోవైపు పోర్న్‌ ఫిల్మ్‌ రాకెట్‌ కేసులో మూడు ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొంటున్న నటి గెహన వశిష్ట్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పోర్నోగ్రఫీ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో గెహన అరెస్టయ్యారు. ఆ సమయంలో తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులకు 15 లక్షలు లంచం ఇవ్వజూపినట్లు వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ చాట్‌లో ఇదంతా బయటపడింది. అయితే ఈ వ్యవహరం వెలుగులోకి రావడంతో.. గెహనా ప్లేట్‌ ఫిరాయించింది. అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని పోలీసులే తనను డిమాండ్‌ చేశారని చెబుతోంది. రాజ్‌కుంద్రా కంపెనీలో గెహన వశిష్ట్‌ మూడు ఆశ్లీల చిత్రాల్లో నటించినట్లు తెలుస్తోంది.