NTV Telugu Site icon

WhatsApp : వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. నెట్ తో పనిలేకుండానే పంపొచ్చు..

Whatsapp (4)

Whatsapp (4)

సోషల్ మీడియా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్స్ సెక్యూరిటీ ని అందిస్తున్నాయి.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. వాట్సప్‌ తన వినియోగదారులకు నెట్‌ అవసరం లేకుండానే ఫైల్‌ షేరింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్‌ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపింది..

ఈ ఫీచర్ కు సంబందించిన బీటా వెర్షన్‌లో పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే మాత్రం ప్రస్తుతం ఎటువంటి మెసేజ్ లను కానీ ఫైల్స్ ను షేర్ చెయ్యడం కానీ చెయ్యడం కుదరదు.. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్ తో పనిలేకుండానే ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు.. సమీపంలోని వాట్సప్‌ యూజర్లతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు.. ప్రస్తుతం ఇది టెస్టింగ్ పొజిషన్ లో ఉంది..

ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతుంది.. ఈ ఫీచర్ ను పొందాలంటే మీరు మీ ఫోన్లో పర్మిషన్స్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ ఫీచర్‌ గూగుల్‌కు చెందిన క్విక్ షేర్, యాపిల్‌లోని ఎయిర్‌డ్రాప్‌ మాదిరి పనిచేయనుంది. లోకల్‌ నెట్‌వర్క్ ద్వారా ఫైల్‌లను పంపవచ్చు.. అంతేకాదు నెంబర్ సేవ్ లో లేకున్నా కూడా ఫైల్స్ ను నేరుగా షేర్ చెయ్యొచ్చు..