NTV Telugu Site icon

Vivek Ranjan Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలనం

Vivek Ranjan Agnihotri

Vivek Ranjan Agnihotri

Vivek Ranjan Agnihotri: కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సినిమాలను ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన చివరికి అందరి మెప్పు పొంది హిట్ సినిమాగా నిలిచింది. ఊహకందని స్థాయిలో వసూళ్లు కూడా సాధించింది. ఈ సినిమాతో దర్మకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మూవీని మన తెలుగు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

Read Also: Goods Train Derailed: రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు.. పలు రైళ్లు రద్దు..

1989-90 కాలంలో జరిగిన యదార్థ సంఘటనలకు సజీవ సాక్ష్యంగా నిలిచ్చిన సినిమా రూ.15కోట్లతో తీస్తే ప్రపంచ వ్యాప్తంగా 340కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అనేపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషీ వంటి తారలు నటించారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మళ్లీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ కాంబో రిపీట్ కానుంది. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ ని మీరే గెస్ చేయండి అంటూ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా మంగళ వారం ఓ పోస్ట్ షేర్ చేశారు. `ది — వార్` ఫిల్ ఇన్ ద బ్లాక్ అంటూ సినిమా టైటిల్ ఏంటో మీరే గెస్ చేయండని ప్రేక్షకులకు ఫజిల్ విసిరారు.

Show comments