NTV Telugu Site icon

OnePlus Nord CE 4 Lite : వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. పీచర్స్, ధర ఎంతంటే?

One

One

ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా కంపెనీ నుంచి మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లో విడుదల చేస్తున్నారు.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ తేదీని కంపెనీ రిలీజ్ చేసింది.. ఈ ఫోన్ ను మార్కెట్ లోకి ఈ నెల 18 న విడుదల చేయబోతున్నారని ప్రకటించారు.. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నార్డ్ సీఈ 4 లైట్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1200నిట్స్ తో హై బ్రైట్నెస్ తో రాబోతుంది.. ఈ ఫోన్ 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో రావచ్చు.. కెమెరా విషయానికొస్తే సెల్ఫీ ప్రియులకు పండగే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో బ్యాక్ డ్యూయల్ కెమెరాతో రాబోతుంది..ఇక ఈ ఫోన్ 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీ సామర్థ్యంతో రాబోతుంది..

అలాగే ఈ కొత్త ఫోన్ ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ ను చైనాలో ముందుగా లాంచ్ చేశారు.. చైనాలో 179 డాలర్లు (దాదాపుగా రూ. 15వేలు) ధరతో ప్రారంభమైంది. ఈ రేంజ్ మోడల్ ధర 248 డాలర్లు (దాదాపుగా రూ. 21వేలు) వరకు ఉండొచ్చు.. అయితే ఇండియా కరెక్ట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.. లాంచ్ రోజే ధర వివరాలు తెలియనున్నాయి..