Site icon NTV Telugu

కేంద్రానికి తెలంగాణ సర్కార్ మరో లేఖ

kcr

కేంద్ర ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌ లో కేటాయింపులు లేవని.. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖ లో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశం పై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడం పై ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ సర్కార్‌. ఇది ఎంత వరకు సబబని లేఖలో ప్రశ్నించింది. ఏఐబీపీ కింద వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అర్హత ఉందో లేదో మరోసారి పునః పరిశీలించాలని కోరింది తెలంగాణ సర్కార్‌.

Exit mobile version