NTV Telugu Site icon

Leopard at Tirumala: తిరుమలలో మరో చిరుత..

Ttd

Ttd

Leopard at Tirumala: తిరుమలలో చిరుత సంచారం కొనసాగుతూనే ఉంది.. నడక మార్గంలో ఓ చిన్నారి చిరుత దాడిలో మృతిచెందిన తర్వాత.. పటిష్ట చర్యలకు దిగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతలు, ఇతర అడవి జంతువుల కదలికలను పసిగడుతోంది.. ఇక, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్‌ చిరుత’ సక్సెస్‌ అయ్యింది.. ఇప్పటి వరకు నాలుగు చిరితులను అటవీశాఖ అధికారులు బంధించారు.. అయితే, ఇంతటితో చిరుతల సంచారం ఆగిపోయినట్టు అంతా సంతోషపడ్డారు.. కానీ, తాజాగా మరో చిరుత ట్రాప్‌ కెమెరాలకు చిక్కిన్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

అలిపిరి నడకమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో మరో చిరుత సంచారం గుర్తించాం.. నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించింది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇక, నడకమార్గంలో భక్తులకు 5వ తేదీ నుంచి ఊతకర్రలను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని.. అలిపిరి దగ్గర భక్తులకు ఊతకర్రలను అందజేసి.. నరసింహస్వామి ఆలయం వద్ద వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం అన్నారు.

మరోవైపు.. శ్రీవారి అభిషేకాని వినియోగించే పాలను టీటీడీ గోశాల నుంచి సేకరిస్తూన్నాం అని తెలిపారు ధర్మారెడ్డి.. స్వామివారి కైంకర్యాలకు ప్రతినిత్యం వినియోగించే 60 కేజీల నెయ్యిని కోనుగోలు చేస్తున్నట్ఉ వెల్లడించిన ఆయన.. త్వరలోనే గోశాల ద్వారా నెయ్యిని తయ్యారు చేస్తామన్నారు. ఆగస్టు నెలలో 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ద్వారా 120.05 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని.. ఇదే సమయంలో కోటి 9 లక్షల లడ్డూలను విక్రయించినట్టు తెలిపారు. 43.07 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా.. 9.07 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. అష్టవినాయక అతిధి గృహాని సామాన్య భక్తులుకు కేటాయించేలా వాటి ధరను 150 రూపాయలకు తగ్గిస్తూన్నాం.. వికాస్ నిలయంలో అతిధి గృహాన్ని 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరణ చేస్తున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.