Andhra Pradesh: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వద్దు బాబోయ్ ఈ వర్షాలు అనే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఉదయం ఎండలు.. రాత్రికి వానలు.. కొన్ని రోజులైతే ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తే.. ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచింది ఉంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మరి కొద్ది గంటలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉది.. ఇది పశ్చిమ దిశగా పయనించి రేపటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. అనంతరం అక్టోబర్ 2వ తేదీనాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం.. దానిని అనుకోని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు..
Read Also: LPG Price Hike: పండగ వేళ షాకిచ్చిన చమురు కంపెనీలు.. LPG సిలిండర్ల ధరలు పెరిగనయ్
ఇక అక్టోబర్ 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో రాగాల వారం రోజులు పటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. కోస్తా జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. మరోవైపు, ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. కోస్తా తీరం వెంబడి గాలులు వేగం అధికంగా ఉన్న నేపథ్యంలో రాగాల నాలుగు రోజులు పాటు మత్య్సకారులు చేపల వేటకు వెళ్ళరాదు అని హెచ్చరించారు.. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ….
