గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది.
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ నటించబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని టాక్.. కత్రీనా కైఫ్ తో స్పెషల్ సాంగ్ చేయించనున్నారని తెలుస్తుంది. అందుకోసం టీమ్ ఆమెను సంప్రదించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీని పై క్లారిటీ రావాల్సి ఉంది..
ఈ భారీ యాక్షన్ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అయితే ఈ సినిమాలో ఎవరికీ జోడిగా నటిస్తుందన్న విషయం పై క్లారిటీ రాలేదు..ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం తో సినిమాకు ఇప్పటినుంచే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది.. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే స్టార్ హీరోలతో అదిరిపోయే డ్యాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి త్వరలో క్రేజీ అప్డేట్ రాబోతుంది..