Site icon NTV Telugu

Heart attack: లాయరన్న జరభద్రం.. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో మరో అడ్వకేట్ మృతి..

Heart Attack

Heart Attack

లాయర్లు గుండెపోటు ఘటనలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కోర్టు ఆవరణల్లో కుప్పకూలుతున్నారు. ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ వేణుగోపాల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో మృతి చెందారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో అడ్వకేట్ మృతి చెందారు. కోర్టు ఆవరణలో ఉన్న బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా గుండెపోటుకు గురైన వెంకటరమణ మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. 25 సంవత్సరాలుగా సికింద్రాబాద్ కోర్టులో అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతితో లాయర్లు సంతాపం వ్యక్తం చేశారు.

READ MORE: Trivikram: త్రివిక్రమ్ నెక్ట్ ఏంటి?

ఇదిలా ఉండగా.. గుండెపోటు మరణాలతో రోజు ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. రోజుకు కార్డియాక్ అరెస్ట్‎తో చనిపోతున్న సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ వరుడు గుర్రంపై కూర్చుని ఉండగానే చనిపోయాడు.. అలాగే కొందరు డ్యాన్స్ చేస్తూ, సినిమా చేస్తూ, వాకింగ్ చేస్తూ.. ఇలా చాలా సందర్భాలలో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. తాజాగా వరుస లాయర్ల మరణాలతో సాధారణ ప్రజల్లో కూడా భయం మొదలైంది. లాయర్లు ఈ గుండెపోటు విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. నిత్యం వాదనలు, కేసులతో బిజీగా ఉంటున్న లాయర్లు తమ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి..

READ MORE: Vallabhaneni Vamsi Case: కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్.. నాకు సంబంధం లేదు..!

Exit mobile version