NTV Telugu Site icon

Odisha: ఒడిశాలో తప్పిన మరో ప్రమాదం.. ఒకే ట్రాక్పై ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్లు..!

Trains

Trains

Odisha: ఒడిశాలో తప్పిన మరో ప్రమాదం.. ఒకే ట్రాక్పై ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్లు..!
Another accident in Odisha.. Passenger and goods trains on the same track..!
Passenger, goods, trains, track, odisha

Odisha: ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఆ దుర్ఘటనలో 288 మంది కోల్పోగా.. మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. మరికొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. అయితే ఈ ప్రమాద ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ప్రమాదం ఒకటి తప్పినట్టైంది.

Read Also: Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా

ఒకే ట్రాక్ పై ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో.. రైళ్లు ఆగిపోయాయి. లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వేగంగా వెళ్తున్న రైలు సడెన్ గా నిలిచిపోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులంతా షాక్ కు గురయ్యారు. ఒక్కసారిగా కిందకు దిగి ఏమైందో చూడటానికి పరుగు తీశారు. దీంతో ఎదురుగా మరో రైలు నిలిచి ఉండటం చూసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Tamil Nadu: ఆర్మీ జవాన్ భార్యపై 40 మంది దాడి.. అసభ్య ప్రవర్తన

అయితే మొన్నటికి మొన్న అంతా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత.. మళ్లీ అలాంటి ఘటనలే ఎందుకు పునరావృతం అవుతున్నాయి. రైల్వే అధికారుల నిర్లక్ష్యమా.. లేక సిగ్నలింగ్ సమస్యలా అని పలు అనుమానాలు తావెత్తుతున్నాయి. బాలాసోర్ లో జరిగిన ప్రమాదాలు మళ్లీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే అలాంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.