Annapurna Devi Alankaram: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు.. సర్వశ్యార్తి హరే దేవీ.. అని పెద్దలు అమ్మవారిని గురించి చెపుతారు.. నిత్యాన్నపానాదులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని అంటారు.. సాక్షాత్తు ఆ శంకరుడే అమ్మవారిని దోసిలి పట్టి భిక్షాందేహి కృపావలంబనకరీ అంటూ స్తుతించారట.. అటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ.. అన్నపానాదులకు లోటుండసని ప్రతీతి.. ఇక, ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. సీఎం జగన్ ను, రాష్ట్ర ప్రజలను అమ్మవారు ఆశీర్వదించాలని వేడుకున్నానని తెలిపారు.. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి విజయం చేకూరాలని అమ్మవారిని వేడుకున్నట్టు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, నేడు శ్రీశైలంలో 3వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి.. సాయంత్రం చంద్రఘంట అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. రావణవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.. మరోవైపు బనగానపల్లె (మం) నందవరం లోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవ రాత్రి మహోత్సవ వేడుకలు.. నేడు 3వ రోజు చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు చౌడేశ్వరిదేవి అమ్మవారు.. మహానంది క్షేత్రంలో మూడవరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా.. నేడు చంద్ర ఘంట దుర్గాదేవి అలంకరణలో దర్శనం ఇవ్వనున్న కామేశ్వరీ దేవి అమ్మవారు.
