అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడులో సంచలనం రేపినా కర్ణాటక చెందిన వివాహిత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని డిఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. డిఎస్పీ కథనం ప్రకారం.. లక్ష్మీ, కుమార్ భార్య, భర్తలు. వీరు రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుని గుర్రంకొండ నివాసం ఉంటున్నారు.
READ MORE: Jasprit Bumrah: గాయం నుండి పూర్తిగా కోలుకోని బుమ్రా.. ఐపీఎల్ 2025కు అందుబాటులో ఉంటాడా?
గత నెల 26వ తేదీ అర్ధరాత్రి భర్త కుమార్ భార్య ముఖంపైన దిండుతో ఆదిమాడు. ఊపిరి ఆడక ఆమె మరణించింది. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. మృతదేహాన్ని కర్ణాటకలోని స్వగ్రామాన్ని తరలించారు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన గుర్రంకొండ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భర్త హత్య చేసినట్లు కనుగొన్నారు. అదుపులోకి తీసుకున్న రైస్ మిల్లు ఓనర్ సహా ఇతర వ్యక్తులను హత్య కేసులో ప్రమేయంపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
READ MORE: Anurag Kashyap : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న వాళ్లు అవినీతిపరులు.. స్టార్ డైరెక్టర్ సంచలనం