NTV Telugu Site icon

Anna Rambabu: అన్నా రాంబాబు నామినేషన్తో మార్మోగిన మార్కాపురం

Anna Rambabu

Anna Rambabu

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక, అన్నా రాంబాబు నామినేషన్తో మార్కాపురం మార్మోగిపోయింది. అట్టహాసంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో వేలాది మందితో భారీగా ర్యాలీతో వెళ్లారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే.. నా లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. అన్నా రాంబాబు నామినేషన్ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చారు.

Read Also: YSRCP: వైసీపీ గూటికి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌..

ఇక, పలువురిని సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు కుటుంబ సభ్యులను మత పెద్దలు ఆశీర్వదించి ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు గెలుపు తథ్యం అని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. భారీ గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థిని వైసీపీ నాయకులు సన్మానించారు. ఇక, సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు నామినేషన్ పత్రాలు అందించారు.