NTV Telugu Site icon

Ankita Bhandari: రిసెప్షనిస్ట్ అంకిత అంత్యక్రియలు పూర్తి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు సీఎం హామీ

Ankita

Ankita

Ankita Bhandari: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. తుది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు అంకిత తండ్రి, సోదరుడు ఆమె అంత్యక్రియలు చేయడానికి మొదట నిరాకరించారు. అనంతరం మనస్సు మార్చుకుని అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి అంగీకరించారని ముఖ్యమంత్రి పుష్కర్‌సింద్ ధామీ తెలియజేశారు. సత్వర న్యాయం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తుందని సీఎం పుష్కర్ ధామి తెలిపారు. తుది పోస్టుమార్టం నివేదికను త్వరలో బహిరంగంగా వెల్లడిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి హామీతో అంకిత అంత్యక్రియలను ఆమె తల్లిదండ్రులు నిర్వహించారు.

మరోవైపు, 19 ఏళ్ల యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్‌లో నిరసనలు కొనసాగాయి. యువతి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి, ఆదివారం ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో నిరసనకారులు రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిని చాలా గంటలపాటు దిగ్బంధించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Delhi: అబ్బాయిలకు కూడా భద్రత లేదు.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం

ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్యకేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మాజీ మంత్రి వినోద్‌ ఆర్య కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఈ కేసుకు సంబంధించి వాట్సప్ చాట్‌లపై కూడా దర్యాప్తు చేపట్టారు.