Anjeer : అంజీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే..అస్సలు వదలరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంజీరా గురించి అందరికి తెలుసు.. పోషకాల నిధి.. ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. పచ్చి పండ్లను తినడం తో పాటు, ఎండిన పండ్లు కూడా చాలా మంచిది.. వాటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అంజీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం..
అదే విధంగా నానబెట్టిన అంజీర పండ్ల వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. మరి నానబెట్టిన అంజీర పండ్ల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నానబెట్టిన అంజీర పండ్లు తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే అత్తి పండ్లలో కరిగే, కరగని ఫైబర్ రెండూ కూడా పుష్కలంగా ఉంటాయి.. ప్రేగు కదలికను మెరుగు పరుస్తాయి. మీ జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారని నిర్ధారించుకోవాలి. అత్తిపండ్లలో కాల్షియం కూడా ఎక్కవగానే ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకలకు అవసరమైన కాల్షియం అందుతుంది.
Also Read
మన శరీరానికి కాల్షియం అందించగల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అత్తి పండ్లతో పాటు కాల్షియం లభించే ఆహార పదార్థాల విషయానికొస్తే సోయా, పాలు, ఆకుపచ్చ ఆకుకూరలు. అంజీర పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. ఫైబర్ అధికంగా ఉండే వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. అధిక బరువుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..ఉదయాన్నే నానబెట్టిని అంజీర్ పండ్లను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ తినడానికి బదులు భోజనం తర్వాత స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని తినడం మంచిది. అత్తిపండ్లలో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియంలు ఉన్నాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మీరు కూడా ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?