Site icon NTV Telugu

Anjali : “రత్నమాల” పాత్రలో నటించడానికి కారణం అదే..?

Whatsapp Image 2024 05 26 At 4.04.28 Pm

Whatsapp Image 2024 05 26 At 4.04.28 Pm

Anjali : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఈ ఏడాది అంజలి కోన వెంకట్ తెరకెక్కించిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుంది. తాజాగా అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధం అయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.

Read Also : Virat Kohli : జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిర్వహించిన మీడియా మీట్ లో అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాలో అంజలి రత్నమాల అనే మాస్ క్యారెక్టర్ లో నటించింది.ఈ తరహా పాత్ర నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంటాయి. నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను.వారు దేనిని లెక్క చేయకుండా పైకి ఎంతో రఫ్ గా కనిపిస్తారు..పైకి అలా కనిపించిన కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది అని అంజలి తెలిపింది. రత్నమాల పాత్రకు సంబంధించి లుక్స్ పరంగా అలాగే డైలాగ్ డెలివరీ పరంగా  ఎంతో కష్టపడ్డాను.నా సినీ కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదని అంజలి తెలిపింది.రత్నమాల పాత్రలోకి ప్రవేశించడానికి కాస్త సమయం తీసుకున్నాను..ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందని అంజలి తెలిపింది.

Exit mobile version