సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాలో హీరో గా నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో గా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భారీ హిట్ అందుకున్నారు. దీనితో అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయం సాధించాడు. ఈ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు.అయితే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ నుంచి మరో స్ట్రెయిట్ సినిమా రాలేదు. దాంతో తన తదుపరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సందీప్.. రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ప్రీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్‌ను గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టిస్తున్న రణ్ బీర్ ను చూసి రణ్‌బీర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ప్రీ టీజరే ఈ లెవల్లో ఉంటే టీజర్ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అని అప్పుడే వారు ఇమేజిన్ చేసుకోవడం మొదలు పెట్టారు..
అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఓ సూపర్ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్‌ను రణ్‌బీర్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే టీజర్ కట్‌కు సంబంధించిన పనుల్లో చిత్రబృందం బిజీ గా ఉందని తెలుస్తుంది.. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తు్ంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నారు.. ఇటీవలే రణ్‌బీర్ కపూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్ తో ఉన్న రణ్‌బీర్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా ఓ రివేంజ్ డ్రామా గా తెరకెక్కుతుందని సమాచారం.అయితే ఈ సినిమాను ముందుగా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించినా.వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా సినిమాను డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.ఈ సినిమా కూడా సంచలన విజయం సాధిస్తే సందీప్ రెడ్డి వంగా పేరు మారు మ్రోగిపోతుంది.
