Site icon NTV Telugu

Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందా..?

Whatsapp Image 2024 01 20 At 3.27.40 Pm

Whatsapp Image 2024 01 20 At 3.27.40 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న రిలీజ్ అయి బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ సుమారు రూ.900కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. ఈ మూవీ పై మొదట్లో విమర్శలు వచ్చినా కూడా కమర్షియల్‍గా మాత్రం భారీ విజయం సాధించింది. ఇక.. యానిమల్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కోర్టులో కేసు నడుస్తుండడం ఇందుకు కారణంగా ఉంది. యానిమల్ సినిమాను నిర్మించిన టీ-సిరీస్, ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍పై ఈ మూవీకి సహ నిర్మాతగా ఉన్న సినీ వన్ స్టూడియోస్ కోర్టులో కేసు వేసింది. తమకు టీ-సిరీస్ బకాయిలను చెల్లించలేదని, అందుకే యానిమల్ ఓటీటీ రిలీజ్‍ను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్‍ను విచారించిన న్యాయస్థానం నేడు టీ-సిరీస్‍తో పాటు నెట్‍ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.నోటీసులు అందడంతో టీ-సిరీస్ మరియు నెట్‍ఫ్లిక్స్ కోర్టుకు అఫిడవిట్స్ సమర్పించాల్సి ఉంది. తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.యానిమల్ మూవీ లాభాల్లో తమకు ఒక్క రూపాయి కూడా టీ-సిరీస్ చెల్లించలేదని సినీ వన్ స్టూడియోస్ కోర్టుకు తెలిపింది. రూ.2.6 కోట్లు ఇచ్చినట్టు టీ-సిరీస్ తరఫున న్యాయవాది తెలిపినా.. అందుకు తగిన ఆధారాలను అయితే చూపలేదు.యానిమల్ సినిమాను జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భావించింది.కానీ ఇప్పుడు ఈ విషయం కోర్టు విచారణపై ఆధారపడి ఉంది. జనవరి 22వ తేదీన ఈ కేసు ఓ కొలిక్కి రాకపోతే యానిమల్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం వున్నట్లు సమాచారం.ఒకవేళ ఈ కోర్ట్ కేసు క్లియర్ అయితే యానిమల్ మూవీ అనుకున్న సమయానికి ఓటీటీ రిలీజ్ కానుంది.

Exit mobile version