NTV Telugu Site icon

Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 01 23 At 5.48.31 Pm

Whatsapp Image 2024 01 23 At 5.48.31 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రభాస్ సలార్ మూవీ కంటే మూడు వారాల ముందే రిలీజైంది. అయితే ఇప్పటికే సలార్ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ యానిమల్ మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాలేదు.దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా మంగళవారం (జనవరి 23) సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ.. యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా వెల్లడించింది. అయితే అది నేరుగా కాకుండా పరోక్షంగా కావడం విశేషం.యానిమల్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడీ వార్తలనే యానిమల్ టీమ్ పరోక్షంగా ప్రకటించింది..యానిమల్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని సలార్ టీమ్ తమను టీజ్ చేసిన వెంటనే యానిమల్ మూవీ టీం స్పందించింది.చెవిటి వాన్ని కాదు నేను. నాకు వినిపిస్తోంది… “ఛాంపియన్ కు త్వరలోనే సెల్యూట్ చేద్దాం” అని ట్వీట్ చేసింది. చివర్లో భారత త్రివర్ణ పతాకంతోపాటు ట్వీట్ లో సెల్యూట్ అనే పదం వాడుతూ రిపబ్లిక్ డే నాడే యానిమల్ ఓటీటీలో కి వస్తోందన్న విషయాన్ని యానిమల్ టీమ్ కన్ఫమ్ చేసింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

నిజానికి సలార్ కూడా రిపబ్లిక్ డే నాడే వస్తుందని అంతా అనుకున్నారు.. కానీ ఆరు రోజుల ముందుగానే అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ జనవరి 20 నే నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది.అయితే యానిమల్ మూవీ థియేటర్లలో సుమారు 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం మరో 8 నిమిషాల అదనంగా రానుంది. అంటే నెట్‌ఫ్లిక్స్ లో యానిమల్ మూవీ 3 గంటల 29 నిమిషాలు ఉండనుంది.నిజానికి యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ కు చివరి నిమిషం వరకూ అడ్డంకులు ఎదురయ్యాయి.ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న సినీ 1 స్టూడియోస్ తమకు టీ సిరీస్ లాభాల్లో వాటా ఇవ్వలేదంటూ కోర్టుకు వెళ్ళింది.. అయితే జనవరి 22(సోమవారం )నిర్మాతలు ఓ ఒప్పందానికి వచ్చారు. దీంతో యానిమల్ ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియరైంది. దీనితో అందరూ అనుకుంటున్నట్లు జనవరి 26 నే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

Show comments