Animal టీవీలోకి వచ్చేస్తున్న యానిమల్ మూవీ..టెలికాస్ట్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న రిలీజై భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈ మూవీపై తొలి షో నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ అసలు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారంలోనే 2.08 కోట్ల వ్యూయింగ్ హవర్స్ తో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది.అంతేకాదు కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్ ఇండియన్ మూవీస్ లో తొలి స్థానంలో కొనసాగింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టి 45 రోజులు అవుతున్నా.. ఏడో స్థానంలో యానిమల్ మూవీ కొనసాగుతోంది. గుంటూరు కారం మరియు డంకీ లాంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా యానిమల్ దూకుడు కొనసాగుతూనే ఉంది.
యానిమల్ సినిమాలో వైలెన్స్ భారీగా ఉంటుంది.. మోస్ట్ వైలెంట్ మూవీగా ఈ చిత్రాన్ని తీసుకొస్తానని చెప్పిన మాటను సందీప్ రెడ్డి వంగా నిజం చేసి చూపించారు.యానిమల్ కథను తాను రాసుకున్న విధంగా తెరకెక్కించడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దాదాపు సక్సెస్ అయ్యాడు. ఎంతో ఎఫెక్టివ్‍గా రూపొందించాడు. రైటింగ్‍లోనూ తన మార్క్ చూపించాడు. ఈ మూవీ ఎంగేజింగ్‍గా అనిపించడంలో స్క్రీన్‍ప్లే ముఖ్యమైన పాత్ర పోషించింది.ఇదిలా ఉంటే ఈ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేశారు.అయితే ప్రస్తుతానికి హిందీ వెర్షన్ మాత్రమే సోనీ మ్యాక్స్ ఛానెల్లోకి రానుంది. మిగతా భాషల్లో ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు.యానిమల్ మూవీ టీవీ ప్రీమియర్ తేదీని సోనీ మ్యాక్స్ ఛానెల్ అనౌన్స్ చేసింది. వచ్చే ఆదివారం (మార్చి 17) రాత్రి 7 గంటలకు యానిమల్ హిందీ వెర్షన్ ను టెలికాస్ట్ చేయనున్నట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. ఇప్పటికే థియేటర్లు, ఓటీటీలో యానిమల్ మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసి అదరగొట్టింది ఇప్పుడు టీవీలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Tags
- #coming to tv
- animal
- movie
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!