Site icon NTV Telugu

Animal : ఓటీటీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న యానిమల్ మూవీ..

Whatsapp Image 2024 02 07 At 4.36.11 Pm

Whatsapp Image 2024 02 07 At 4.36.11 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఇప్పటికీ ఓటీటీలోనూ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన సలార్ మూవీని వెనక్కి నెట్టి ఈ మూవీ ఓటీటీలో అన్ని ఇండియన్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసింది.రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ మూవీకి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ నమోదు కావడం విశేషం. తొలి వారంలోఈ సినిమా ఇండియన్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్ లో నంబర్ వన్ గా నిలిచింది… రెండో వారం కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ మూవీ నిలిచింది.

ఇండియన్ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో నంబర్ వన్ సినిమాగా ఉన్న యానిమల్.. ఇంగ్లిషేతర సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో తొలి వారంలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా కూడా ఇదే. ఇదే ఊపులో 10 రోజుల్లోనే ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.యానిమల్ మూవీకి ఇప్పటి వరకూ 55 లక్షల వ్యూస్ వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది..అయితే ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్‌షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. ఇప్పుడు ఆ రెండు సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్‌షిప్ ను యానిమల్ మూవీ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ కూడా ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. థియేటర్లలో రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన యానిమల్.. ఓటీటీలోనూ అదే స్థాయిలో సత్తా చాటుతోంది.

Exit mobile version