Animal : జమాల్ కుదు సాంగ్ సీతార్ వెర్షన్.. నెక్స్ట్ లెవెల్ అంతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.యానమిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని జమాల్ కుదు సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కోట్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ పాటకు ఓ వ్యక్తి సితార్ రెండిషన్ ఇచ్చాడు. ఇది ఒరిజినల్ సాంగ్ కంటే కూడా మరో లెవల్ లో ఉందని చెప్పొచ్చు.సితార్ ప్లేయర్ అయిన రిషబ్ రిఖిరామ్ శర్మ ఇప్పుడీ జమాల్ కుదు పాటను తనదైన స్టైల్లో వాయించాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని రోజుల కిందట పోస్ట్ చేశాడు. యూట్యూబ్ లో ఆ ఒరిజినల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. ఈ సితార్ వెర్షన్ కూడా అంతే రేంజ్ హిట్ అయింది.
రిషబ్ అందించిన ఈ సరికొత్త వెర్షన్ కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చింది.చిన్నప్పటి నుంచీ నేను రెండు మ్యూజికల్ దారుల్లో వెళ్లాను. ఓవైపు సితార్ ను సాంప్రాదాయ మార్గంలో నేర్చుకుంటూనే మరోవైపు నాకు నేనుగా దానితో భిన్నమైన మ్యూజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నా ఈ రెండు అభిరుచులను కలిపి మీ ముందుకు తీసుకొస్తున్నాను” అనే క్యాప్షన్ తో రిషబ్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. యానిమల్ మూవీలోని ఈ జమాల్ కుదు సాంగ్ ఇరాన్ కు చెందిన సాంప్రదాయ బండారీ మ్యూజిక్. దీనిని ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హర్షవర్దన్ రామేశ్వర్ కొద్దిగా మార్పులు చేసి అందించాడు. ఈ సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేసింది. పాటలోని భాష తెలియకపోయినా కానీ ఆ పాట పాడిన తీరు అలాగే ఆ మ్యూజిక్ ను బాగా ఎంజాయ్ చేశారు.యానిమల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసిన ఈ పాటే ఎక్కువగా వినిపించింది. మూవీలో విలన్ అయిన బాబీ డియోల్ పాత్ర అబ్రార్ ఎంట్రీ సందర్భంగా వచ్చే పాట ఇది. ఇందులో అతడు తలపై మందు గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. చాలా మంది ఆ స్టెప్పులు ట్రై చేస్తూ రీల్స్ కూడా చేశారు. ఇక యూట్యూబ్ లో అయితే ఈ సాంగ్ లిరికల్ మరియు వీడియో రెండూ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!