‘అనిల్ సుంకర’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు. విదేశాల్లో వ్యాపార రంగంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా నిర్మాణం మీద ఉన్న మక్కువతో భారత్‌లో చిత్ర నిర్మాణాన్ని స్థాపించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌ను స్థాపించి.. తన స్నేహితులు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా 2011లో ‘దూకుడు’ సినిమా నిర్మించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో అనిల్ సుంకరకు తిరుగులేకుండా పోయింది.
Also Read: Google Pixel 9 Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్స్.. రూ.80 వేల గూగుల్ పిక్సెల్ ఫోన్ 35 వేలకే!
దూకుడు అనంతరం మహేశ్ బాబుతో అనిల్ సుంకర మరో మూడు సినిమాలు చేశారు. వన్: నేనొక్కడినే, ఆగడు, సరిలేరు నీకెవ్వరు సినిమాలు నిర్మించారు. ఆగడు మిశ్రమ ఫలితాలను ఇవ్వగా.. వన్, సరిలేరు నీకెవ్వరు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ విషయంపై తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో అనిల్ సుంకర మాట్లాడారు. మహేశ్ బాబు గారితో ఒక్క సినిమా చేస్తే చాలని తాను ఇండియా వచ్చానని, ఏకంగా నాలుగు సినిమాలు చేశానని చెప్పారు. ఆగడు సినిమా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగా వచ్చాయని, నాలుగో రోజు బొమ్మ తిరగబడిందని తెలిపారు. పాడ్‌కాస్ట్ ప్రోమోలో తన వ్యాపారం, ఏజెంట్ సినిమా, 14 రీల్స్ గురించి విషయాలను పంచుకున్నారు. శనివారం ఫుల్ వీడియో అందుబాటులోకి రానుంది.
