NTV Telugu Site icon

Anil Ravipudi : బాలయ్య తో సినిమా నాకు లైఫ్ లో గుర్తుండి పోతుంది..!!

Whatsapp Image 2023 06 09 At 8.45.07 Pm

Whatsapp Image 2023 06 09 At 8.45.07 Pm

నట సింహం బాలకృష్ణ. ఈయన అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా ”భగవంత్ కేసరి”.ఈ సినిమా టైటిల్ ను ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ ఎక్కువ భాగం పూర్తి అయినట్లు సమాచారం.బాలకృష్ణ జూన్ 10న తన పుట్టిన రోజు సందర్బంగా భారీ ట్రీట్ ను సిద్ధం చేసారు మేకర్స్.. ఇప్పటికే టైటిల్ ప్రకటించి ఎంతో హైప్ పెంచేయగా.. రేపు బర్త్ డే రోజు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య మాస్ మంత్ర సాంగ్ ను బాలయ్య అభిమానుల తో కలిసి అనిల్ రావిపూడి లాంచ్ చేసారు.

ఈ సందర్భం గా అనిల్ రావిపూడి మాట్లాడారు.ఈయన మాట్లాడుతూ.. బాలయ్య గారు నటించిన సినిమాల ను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను.. తొలిసారిగా ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం రావడం నాకు సంతోషం గా ఉందని.. సెట్స్ లో బాలయ్య ప్రతీ ఒక్కరికి ఎంతో రెస్పెక్ట్ ను ఇస్తారని.. ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవం ఇంకా పెరిగాయని అనిల్ తెలిపారు. అలాగే భగవంత్ కేసరి సినిమా తన కెరీర్ ఎంతో స్పెషల్ గా ఉంటుందని.. భగవంత్ కేసరి సినిమా తనకు మాత్రమే కాకుండా బాలయ్య గారి ఫ్యాన్స్ కు కూడా ఎంతో స్పెషల్ గా నిలిచి పోతుంది అని విడుదల తర్వాత తప్పకుండ ఈ సినిమా అందరిని బాగా ఆకట్టుకుంటుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పారు అనిల్.. మరి రేపు టీజర్ ఎలా ఉంటుందో.. ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. రేపు బాలయ్య ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఉంటుంది అని అనిల్ తెలిపినట్లు సమాచారం.ట్రైలర్ కచ్చితంగా అందరిని అలరిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు