Site icon NTV Telugu

Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

Anil Ravipudi

Anil Ravipudi

Krithi Shetty: సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో మెగా సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్‌లతో కలిసి ఆయన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ​ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటించే అవకాశందో అనే దానిపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

READ ALSO: బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!

తాజాగా హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. తన మూవీలో నందమూరి హీరోకి జోడిగా కృతి శెట్టి నటిస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పారు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్‌కి జోడీగా ఏ భామ నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో, సినిమా లవర్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతికి రావాల్సిందే అనే ట్రేడ్ మార్క్ సెట్ చేసిన ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్.. ఇప్పుడు తన కొత్త సినిమాను కూడా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు.

READ ALSO: Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?

Exit mobile version