Anil Ravipudi: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. తీసింది తొమ్మిది సినిమాలు ఇందులో అన్నీ హిట్. రీసెంట్‌గా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా ప్రాంతీయ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా కోట్లల్లో వసూళ్లు చేసింది. అయితే.. ప్రస్తుతం ఓ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను కామెడీ సినిమాలు తీయడానికి జంధ్యాల, రాజేంద్ర ప్రసాద్ కారణమని ఆ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి తెలిపాడు.
READ MORE: PM Modi: మహిళ పాదాలకు నమస్కరించిన మోడీ.. వీడియో వైరల్
“నేను ఈ ఇద్దరిని చిన్నప్పుడు సినిమాల్లో చూసి ఉండకపోతే ఇలాంటి సినిమాలు తీసేవాడిని కాదు. అనిల్ రావిపూడి కామెడీ కొత్తగా, డిఫరెంట్‌గా ఉందని చాలా మంది అంటున్నారు. అన్ని కాంప్లిమెట్స్‌కు రీజన్ వాళ్లే. ఇది నేను గర్వంగా చెబుతున్నాను. రాజేంద్ర ప్రసాద్, జంధ్యాల గారు లేకపోతే ఈ కామెడీ టైమింగ్ నాకు వచ్చి ఉండేది కాదు. మీలాంటి గొప్ప ఆర్టిస్టులతో నాకు సినిమాల్లో పని చేసే అదృష్టం నాకు దొరికింది. థ్యాంక్యూ రాజేంద్ర ప్రసాద్ సార్.” అని వేదికపైన నుంచి అనిల్ రావిపూడి చెప్పారు.
READ MORE: Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్
