NTV Telugu Site icon

Hoax Call: రైల్వే పోలీసుపై కోపం.. పుణె రైల్వేస్టేషన్‌కు బూటకపు కాల్

Railway

Railway

Hoax Call: అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా పోలీసులు మోహరించారు. అక్కడ ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనతో పరుగులు తీశారు. పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు పుణె రైల్వేస్టేషన్‌లో ఉగ్రదాడి జరగొచ్చని సమాచారం అందడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే చివరకు అది బూటకపు కాల్ అని తేలడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుతో ఓ వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో, సదరు వ్యక్తి ఆగ్రహానికి గురై ఇలా బూటకపు ఫోన్‌ కాల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బూటకపు కాల్ నేపథ్యంలో పోలీసులు ఆగ్రహానికి లోనయ్యారు. రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బందితో వాగ్వాదానికి దిగిన తర్వాత ఆగ్రహించిన వ్యక్తి కాల్ చేశాడని అధికారి ఒకరు తెలిపారు.

Ban on Kite Flying: ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్.. గాలిపటాలు ఎగురవేయడంపై నిషేధం

శుక్రవారం సాయంత్రం ఈ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కాల్‌ నేపథ్యంలో పూణె రైల్వే స్టేషన్‌లో భద్రతను పెంచారు. సోదాలు నిర్వహించబడ్డాయి కానీ అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు. కాల్ చేసిన వ్యక్తిని కత్రాజ్ ప్రాంతంలో గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. రైలులో కొన్ని కారణాల వల్ల ఆర్‌పీఎఫ్ సిబ్బందితో వాగ్వాదం జరిగిన తర్వాత కోపంతో బూటకపు కాల్ చేయాలని నిర్ణయించుకున్నానని అతను పోలీసులకు చెప్పాడు. ఆ కాల్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments