Raja Sekhar: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కి కొత్త సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయాలయ్యాయి. నవంబర్ 25వ తేదీన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కాలికి గాయమైంది. రాజశేఖర్ ప్రస్తుతం వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ, కథానాయకుడిగా, ప్రధాన పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మేడ్చల్ సమీపంలో జరుగుతున్న షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… రాజశేఖర్‌కు కుడి కాలి మడమ దగ్గర బలమైన ఇంజ్యూరీ అయింది.
భారత మార్కెట్‌లో HMD కొత్త HMD 100, HMD 101 ఫీచర్ ఫోన్లు లాంచ్.. ఫీచర్లు ఇవే..!
గాయమైన వెంటనే యూనిట్ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే సర్జరీ నిర్వహించారు. గాయం బలంగా ఉండటం, బోన్ బయటకు రావడంతో సర్జరీ సుమారు మూడు గంటల పాటు జరిగింది. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్, వైర్ అమర్చినట్లు తెలిసింది. ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి. నొప్పని భరిస్తూనే రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త ఫీచర్లు, 5500mAh రీప్లేసబుల్ బ్యాటరీ, ప్రైవసీ స్విచ్‌తో కొత్త Jolla Phone లాంచ్..!
గాయం తీవ్రత దృష్ట్యా, సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రాజశేఖర్‌కు సూచించారు. ముఖ్యంగా గాయమైన కాలిని కదపకూడదని తెలిపారు. దీని కారణంగా ఆయన కొద్ది రోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉంటారు. ఆయన తిరిగి జనవరి 2026లో మళ్ళీ చిత్రీకరణలు ప్రారంభించే అవకాశం ఉంది. రాజశేఖర్ అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో ‘బైకర్’ ఒకటి. ఇది కాకుండా, ఆయన మరో రెండు సినిమాలకు పనిచేస్తున్నారు, వాటి టైటిల్స్ ఇంకా ఖరారు కాలేదు. రికవరీ తర్వాత ఈ సినిమాల చిత్రీకరణలు తిరిగి మొదలవుతాయి.
