NTV Telugu Site icon

Anganwadis Chalo Vijayawada: చలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు..

Anganwadi

Anganwadi

Anganwadis Chalo Vijayawada: తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్లో పోరాటం కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీలకు వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి.. అయితే, ఎస్మా ప్రయోగించి బలవంతంగా విధుల్లో చేరాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. అయినా వారు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తు్న్నారు. అందులో భాగంగా ‘జగనన్నకు చెబుదాం’ పేరిట ఈ రోజు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం వైఎస్‌ జగన్‌కు ఇచ్చేందుకు వస్తున్నామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు.. మరోవైపు ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంగన్వాడీలు ప్రకటించారు.. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. అంగన్వాడీలతో పాటు.. వారికి మద్దతుగా నిలిచిన పార్టీలు, ప్రజాసంఘాల నేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు..

అంగన్వాడీల ఛలో విజయవాడ పిలుపుతో తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కదలికలుపై దృష్టి పెట్టారు పోలీసులు.. వామపక్ష పార్టీ నేతలు సహా అంగన్ వాడి నాయకులకు ఛలో విజయవాడకు అనుమతులు లేవని ముందస్తు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు.. రైళ్లు, బస్సుల ద్వారా విజయవాడ వెళ్లే అవకాశం ఉండడంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ లు దగ్గర అప్రమత్తం అయ్యారు. ఇక, వివిధ జిల్లాల నుంచి విజయవాడకు బస్సులు, రైళ్లలో వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.. మరోవైపు.. అంగన్వాడీల విజ్ఞాపన యాత్ర కు విజయవాడ నగర ప్రజలను సహకరించమని యూటీఎఫ్‌ నేతలు విజ్ఞప్తి చేశారు.. ఎస్మాకు ఎదురు నిలబడిన అంగన్వాడీల నిరసన చరిత్రాత్మకంగా అభివర్ణించారు.

ఇక, కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ పోలీస్ స్టేషన్ లో దీక్ష చేస్తున్నారు సీపీఎం నేత సీహెచ్ బాబురావు .. అక్రమంగా అరెస్టు చేసి, ఫోన్ లాక్కుని ఎక్కడకు తీసుకుని పోతున్నారో కూడా చెప్పలేదు.. కనీసం తన సహచరులకు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు పోలీసులు.. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా దీక్ష చేపట్టారు బాబూరావు.. మరోవైపు బెజవాడలో అంగన్ వాడీ వర్కర్ల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయం నుంచే అరెస్టులు చేస్తున్నారు. ధర్నా చౌక్ శిబిరానికి నిన్న రాత్రే భారీగా చేరుకున్నారు అంగన్‌వాడీఆలు.. సుమారు వెయ్యి మంది అంగన్ వాడీలను అరెస్ట్ చేశారు.. ఆర్టీసీ బస్సులలో పీఎస్‌కు తరలించారు.. టెంట్ లో లైట్లు ఆర్పేసి బలవంతంగా అరెస్టులు చేశారుని.. తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు నేతలు.. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతలను కూడా తరలించారు పోలీసులు.

రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెల్లవారు జామున విజయవాడలో అంగన్వాడీల దీక్షలను భగ్నం చేసి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ పార్టీలు, సంఘాలను సంప్రదించి నిరసనలు తెలియజేయాలంటూ పిలుపునిచ్చారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఇక, ఛలో విజయవాడ కి వెళుతున్న అంగన్‌వాడీలను గుంటూరులో తూర్పు సబ్ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. తెలంగాణలో జీతాలు పెంచిన మాదిరిగా పెంచుతానని సీఎం మోసం చేశారంటూ అంగన్ వాడిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమ ఓట్లు ప్రభుత్వానికి అవసరం లేదా అని మండిపడ్డారు.

చలో విజయవాడ వెళుతున్న మమ్మలిని అడ్డుకోవడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంగన్‌వాడీల కార్యక్రమంతో బెజవాడలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.. తెల్లవారుజాము నుంచే అంగన్ వాడీల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.. ధర్నా చౌక్ నుంచి సుమారు 35 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో అంగన్ వాడీ వర్కర్లను అరెస్ట్ చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.. నగరానికి వస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు.. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇతర ప్రధాన కూడళ్లలో భారీగా మోహరించారు.. నగరంలోకి వస్తున్న వారిని జల్లెడ పడుతున్నారు.. తూ.గో. జిల్లా నుంచి సీఎం ఇంటిని ముట్టడించే కార్యక్రమంలో భాగంగా వెళుతున్న 200 మంది అంగన్వాడీ కార్యకర్తలను వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.. వేర్వేరు ప్రాంతాల నుంచి బెజవాడ చేరుకుంటున్న అంగన్ వాడీ వర్కర్లు.. ధర్నా చౌక్ వైపు వస్తున్న వారిని ఎప్పటికప్పుడు అరెస్టులు చేసి బస్సుల్లో తరలిస్తున్నారు.. ఖాజా టోల్గేట్ వద్ద కు భారీగా చేరుకున్నారు అంగన్వాడీలు. చిత్తూరు ,కర్నూలు ప్రాంతాల నుండి వస్తున్న అంగన్వాడీలను టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.. దీంతో, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. తిరుపతి నుంచి విజయవాడలో వెళ్తున్న అంగన్వాడీలను కావలి వద్ద అడ్డుకున్నారు పోలీసులు..

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని టోల్గేట్ల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలను తనిఖీ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్ లో అంగన్వాడీ ల నిరవధిక నిరాహారదీక్ష ను పోలీసులు భగ్నం చేసారు.. తెల్లవారుజాము నుంచే అంగన్వాడీలను అరెస్టులు చేసి జిల్లాలలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.. తమ డిమాండ్లు మొత్తం తిర్చకుండా, జీఓ లు ఇవ్వకుండా, 47 రోజులు తరువాత నిర్బంధిస్తున్నారంటున్నారు అంగన్వాడీలు.. ఎక్కడికక్కడే నిరసనలు కొనసాగిస్తాం అంటున్నారు.