Site icon NTV Telugu

Anganwadi strike: నేటి నుంచి అంగన్‌వాడీల సమ్మె.. అన్ని కేంద్రాలు మూత..

Anganwadi Strike

Anganwadi Strike

Anganwadi strike: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. నేటి నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించిన మూడు ప్రధాన సంఘాలు.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీ తదితర డిమాండ్లపై వారు మంగళవారం నుంచి సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి.. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్‌వాడీలు.. తాజాగా జిల్లా కేంద్రాల్లోనూ చేపడుతున్నారు.

Read Also: Google Trends 2023 : గూగుల్ సెర్చ్ లో టాప్ సినిమాలు,షోలు ఇవే..

అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపడుతున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. న్యాయపరమైన హక్కుల కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల పోరాటంలో అర్థముందని.. అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్లకు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయలేదని తెలిపింది. అంగన్వాడీ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. టీచర్లకు, వర్కర్లకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తోందని విమర్శించింది. అయితే, వేతనాల పెంపు, గ్రాట్యుటీ వంటి డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు అంగన్వాడీలు..

Exit mobile version