Anganwadi Protest: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది.. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు అంగన్వాడీలు.. ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. ప్రభుత్వంతో పలు దఫాలుగా సాగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. దీంతో.. రోజుకో తరహాలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.. ఇక, సంక్రాంతి పండుగ రోజు కూడా వినూత్న తరహాలో ఆందోళనకు దిగారు.. విజయవాడ ధర్నాచౌక్ లో అంగన్వాడీల నిరసన ధర్నా 35వ రోజుకు చేరుకుంది.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వినూత్న విధానంలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైనే పొంగళ్లు వండి వారుస్తున్నారు.. అలాగే సంక్రాంతి ముగ్గులు సైతం శిబిరం బయట రోడ్డుమీదే వేసి సంక్రాంతి పాటల బదులుగా నిరసనలు తెలుపుతున్నారు..
Read Also: Anantapur: అనంతపురం వైద్యుడికి అరుదైన గౌరవం.. అమెరికాలో ఓ వీధికి అతడి పేరు..
రోడ్డుపైనే సంక్రాంతి ముగ్గులు వేసిన నిరసనకు దిగిన అంగన్వాడీలు.. వేతనాలు పెంచేవరకూ పోరాడుతాం అంటూ నినాదాలు చేశారు.. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడతాం అంటూ నినదించారు.. రోడ్డుపైనే పొంగలి వండి నిరసన వ్యక్తం చేశారు. అయితే పలుమార్లు చర్చలకు అంగన్‌వాడీ సంఘాల నేతలను ప్రభుత్వం పిలిచింది. అయితే ప్రభుత్వం వారి డిమాండ్లపై సరైన హామీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలం అవుతునే ఉన్నాయి. అంగన్‌వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించిన విషయం తెలిసిందే. వేతనాలు పెంపు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అంగన్‌వాడీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంలో.. ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు..
