Site icon NTV Telugu

IND vs ENG: భారత్‌తో మ్యాచ్‌లు.. ఇంగ్లండ్ జట్టులోకి ఆడి కొడుకొచ్చేశాడు!

Rocky Flintoff

Rocky Flintoff

ఇండియా ‘ఎ’తో ఇంగ్లండ్ లయన్స్‌ జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఇండియా ఎతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ లయన్స్ 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ 5 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సెంచరీ చేయడంతో రాకీకి చోటు దక్కింది. యాషెస్ 2005 హీరో ఫ్లింటాఫ్ కుమారుడిపై భారీ అంచనాలే ఉన్నాయి.

సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ ఇంగ్లండ్ లయన్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 36 ఏళ్ల వోక్స్ చీలమండ గాయం కారణంగా జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. జూన్‌లో భారత్‌తో జరిగే ఇంగ్లండ్ సీనియర్ జట్టు టెస్ట్ సిరీస్‌కు ముందు తన ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకోవడానికి లయన్స్ మ్యాచ్‌లను ఉపయోగించుకోనున్నాడు. లయన్స్ జట్టుకు జేమ్స్ రెవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌ ఎ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ మే 30న, రెండో మ్యాచ్‌ జూన్‌ 6న ఆరంభం అవుతాయి.

Also Read: IPL 2025 Playoffs: ముంబై రెండో స్థానానికి చేరుకుంటుందా?.. అవకాశాలు ఇవే!

ఇంగ్లండ్ లయన్స్ జట్టు:
జేమ్స్ రెవ్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలియో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ, అజీత్ సింగ్ డేల్, క్రిస్ వోక్స్.

Exit mobile version