Site icon NTV Telugu

SAINDHAV :స్టైలిష్ లుక్ లో ఆండ్రియా జెర్మియా.. బర్త్ డే బ్యూటీకీ సర్ప్రైస్ ఇచ్చిన సైంధవ్ టీం..

Whatsapp Image 2023 12 21 At 11.30.45 Pm

Whatsapp Image 2023 12 21 At 11.30.45 Pm

టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హిట్ మూవీ ఫేం శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేశ్‌ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్‌ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌ గా విడుదల కానుంది. టీం రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీ అయిపోయింది.ఈ చిత్రంలో ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.నేడు తన పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ బిగ్ సర్ప్రైస్ ఇచ్చింది.అద్భుతమైన పర్‌ఫార్మర్‌ ఆండ్రియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ కొత్త లుక్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వైట్‌ షర్ట్‌ మరియు బ్లూ జీన్స్‌ కాంబో డ్రెస్‌లో డుకాటి బైక్‌పై సూపర్ స్టైలిష్‌గా ఉన్న ఆండ్రియా లుక్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌ మిషన్‌ నేపథ్యం లో వస్తున్న సైంధవ్‌ మూవీ లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు..మేకర్స్‌ చాలా రోజుల క్రితమే సైంధవ్‌ పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్‌ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో మరియు కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్‌ గ్లింప్స్ వీడియో ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version