SAINDHAV :స్టైలిష్ లుక్ లో ఆండ్రియా జెర్మియా.. బర్త్ డే బ్యూటీకీ సర్ప్రైస్ ఇచ్చిన సైంధవ్ టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హిట్ మూవీ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. టీం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీ అయిపోయింది.ఈ చిత్రంలో ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.నేడు తన పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ బిగ్ సర్ప్రైస్ ఇచ్చింది.అద్భుతమైన పర్‌ఫార్మర్ ఆండ్రియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ కొత్త లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వైట్ షర్ట్ మరియు బ్లూ జీన్స్ కాంబో డ్రెస్‌లో డుకాటి బైక్‌పై సూపర్ స్టైలిష్‌గా ఉన్న ఆండ్రియా లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యం లో వస్తున్న సైంధవ్ మూవీ లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు..మేకర్స్ చాలా రోజుల క్రితమే సైంధవ్ పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో మరియు కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!