Site icon NTV Telugu

Andrapradesh : కడియపులంక ముసలమ్మ వారికి రూ.31.25 లక్షల నోట్లతో అలంకరణ..

andrapradesh

andrapradesh

శ్రావణమాసంలో మహిళలు వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా పూజిస్తారు.. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.. ఒక్కో ఆలయంలో ఓ విధంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేకతను చాటుకుంటాడు.. ఇక ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ఓ అమ్మవారిని ఏకంగా నోట్లతో అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ వారి ఆలయం లోని అమ్మవారిని నోట్లతో అలంకరించారు.. రూ.31 .25 లక్షల నోట్లతో అలంకరించారు. ప్రస్తుతం చాలామణిలో ఉన్న అన్ని రకాల కొత్త నోట్లను అంటే రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద, రెండొందలు,అయిదొందలు వినియోగించి ఈ అలంకరణ అద్భుతంగా చేశారు.అలాగే బ్యాంకుల ద్వారా కొత్త నాణేలు కూడా తీసుకుని అలంకరించారు. దాదాపు మూడు రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేసారు..

పలు తెలుగు పండగలకు కూడా ఈ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు.. ఈ ఆలయ కమిటీ వారు విన్నూత్న రీతిలో జరుపుతూ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకతను చాటుకుంటూ వార్తలకు ఎక్కుతారు. ఆ విధంగానే ఈ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణకు లక్షలాది రూపాయల నోట్లను వినియోగించడం అందర్నీ ఆకట్టుకుంటుంది.భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి నిత్య అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ, ధవళేశ్వరం శివాలయం అర్చకులు తదితరుల ఆధ్వర్యంలో ఈ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.. ఈ ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Exit mobile version