NTV Telugu Site icon

Marriage: ఆంధ్రా అబ్బాయి, మలేసియా అమ్మాయి.. 12 ఏళ్లు నిరీక్షించి ఎట్టకేలకు..

Marriage

Marriage

Marriage: ప్రేమకు కులమత వ్యత్యాసాలు ఉండవు. ఆకర్షణ.. పరిచయం చిగురిస్తే చాలు స్నేహితులై.. ఆపై ప్రేమికులై ఒకరి కోసం ఒకరు అనేంతగా దగ్గరవువుతుంటారు యువతీయువకులు. అలాగే తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించి సుఖాంతం చేసుకుంటుంటారు. ప్రేమకు హద్దులు ఉండవు. దేశాలు, ఖండాంతరాలు కూడా లేవు అంటారు. సరిగ్గా అలాగే ఆంధ్రా అబ్బాయి.. మలేసియా అమ్మాయి ఒక్కటయ్యారు.‌ పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్షంలోనే.. హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు.

విశాఖకు చెందిన భవానీ ప్రసాద్‌, మలేసియాకు చెందిన ఐక్‌వేది హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం వీరు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లారు. అక్కడ వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు వైపులా పెద్దలకు తమ ప్రేమ గురించి వివరించారు. అమ్మాయి తరపు వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తాను పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానని ఆమె స్పష్టం చేసింది. అబ్బాయి కూడా అదే మాట చెప్పి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వారిద్దరు స్నేహితులుగానే ఉండిపోయారు. వారు ఎన్నో పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్నా మనస్సు మాత్రం మారలేదు.

Food Poison: ఫుడ్ పాయిజన్.. 36 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

భవానీ ప్రసాద్‌ ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగా బిజినెస్ చేస్తుండగా.. ఆమె కూడా తన ఉద్యోగం మాని అతని సంస్థలో చేరి వ్యాపార కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఆ విధంగా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరికీ 41 ఏళ్లు వచ్చాయి. ఇటీవలే ఐక్‌వే కుటుంబసభ్యులు వీరి పెళ్లికి ఆమోదం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ శుక్రవారం వీరి వివాహం జరిగింది.